'సరిగమప 25 years - ఒకే దేశం ఒకే రాగం' అనేది, 'సరిగమప' పేరుతో తెలుగులో 2011లో ప్రారంభమైన సింగింగ్ షో, విజయవంతంగా 12 సీజన్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా చేస్తున్న ఈవెంట్. ఇప్పటివరకూ ఈ షోలో పాల్గొని, అద్భుతమైన టాలెంట్ చూపించి, టాలివుడ్లో సింగర్స్‌గా రానించినవారు, వారి పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ, మీ కోసం మళ్లీ వారి స్వరాన్ని పాటల రూపంలో పంచుకోనున్నారు. రవి, శ్యామల యాంకర్లుగా వ్యవహరించగా, సింగర్స్ అనురాగ్ కులకర్ణి, రేవంత్, ధనుంజయ్, బుల్లి తెర ఎంటర్టైనర్స్, అనసూయ, తాగుబోతు రమేష్, సీరియల్ నటులు ప్రతాప్, సన్నీ, జడ్జులు చంద్రబోస్, విజయ్ ప్రకాష్ మరియు మరింత మంది మిమ్మల్ని అలరించేందుకు సిద్దంగా ఉన్నారు. మిస్సవకండి, కేవలం ZEE5లో!