వినోదానికి ఆహ్వానం పేరుతో ZEE తెలుగు సీరియల్ యాక్టర్స్ అందరూ మిమ్మల్ని అలరించడానికి ఒకటై వచ్చారు. గత కొన్ని వారాలుగా తెలుగు సీరియల్స్ ప్రసారాలు నిలిచిపోగా, వాటిని తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంలో, మీ ఫేవరేట్ సీరియల్స్‌లోని లీడ్ యాక్టర్స్ మీ ముందుకు వచ్చి వారి వారి పాత్రలు మరియు కధనం గురించి మీతో వివరిస్తున్నారు. అంతేకాదు, వారి సీరియల్ కథలకు అనుగుణంగా, డాన్స్ పెర్ఫార్మన్సులు కూడా చేశారు. బుల్లితెర తారలందరూ కలిసి వచ్చిన ఈ ఈవెంటుకి ప్రదీప్ యాంకరింగ్ చేయగా, మరెన్నో సరదా క్షణాలతో ముస్తాబయిన 'వినోదానికి ఆహ్వానం' మిస్సవ్వకండి, కేవలం ZEE5లో!